అమెరికా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గౌరు వెంకట్ రెడ్డి ని ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని చెస్టర్ స్ప్రింగ్స్ నగరంలోని ప్రవాసాంధ్రులతో సమావేశమైన గౌరు వెంకట్ రెడ్డి పాణ్యం నియోజకవర్గ అభివృద్ధిలో ఎన్నారై లు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పాణ్యం నియోజకవర్గాన్ని మెగా ఇండస్ట్రియల్ హబ్‌గా అభివృద్ధి చేస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే గౌరు చరిత నాయకత్వంలో పాణ్యం నియోజకవర్గం హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో కీలకపాత్ర పోషించనుందని తెలిపారు. ఎన్నారైలు తమ నైపుణ్యం, పెట్టుబడులతో ముందుకు వచ్చి తమవంతు పాత్ర పోషించాలని కోరారు. కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్, తానా బోర్డు సభ్యుడు పొట్లూరి రవి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జగదీశ్ రెడ్డి అనుముల, తానా రీజినల్ కోఆర్డినేటర్ ఫణి కంతేటి, మురళి రెడ్డి, బాలాజీ వీర్నాల, ప్రసాద్ కునారపు, హరి తుబాటి, రవి చిక్కాల, కోటి యాగంటి, సురేష్ యలమంచి, లక్ష్మినరసింహ రెడ్డి కొండా పాల్గొన్నారు.















