Skip to main content

Namaste NRI

రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా.. కొత్త షెడ్యూల్ ప్రారంభం

రామ్‌ పోతినేని కథానాయకుడిగా రూపొందుతోన్న కమర్షియల్‌ ఎంటైర్టెనర్‌ ఆంధ్రాకింగ్‌ తాలూకా. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక.  మహేశ్‌బాబు.పి దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజమండ్రిలో మొదలైన తాజా షెడ్యూల్‌లో రామ్‌ పోతినేని, కన్నడ స్టార్‌ ఉపేంద్రలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇందులో ఉపేంద్ర సూపర్‌స్టార్‌గా నటిస్తుండగా, ఆయన డైహార్డ్‌ ఫ్యాన్‌గా రామ్‌ కనిపించనున్నారు. హై ప్రొడక్షన్‌ వాల్యూస్‌తో మాస్‌ ప్రేక్షకులను మెప్పించే లా ఈ సినిమా ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రంలో రావురమేష్‌, మురళీశర్మ, సత్య, రాహుల్‌ రామకృష్ణ, వీటీవీ గణేశ్‌ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ నూని, సంగీతం: వివేక్‌-మెర్విన్‌.

Social Share Spread Message

Latest News