Namaste NRI

ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (ఎఎఎ)  ఫీనిక్స్‌ లో సమావేశం నిర్వహించింది. ఫీనిక్స్, ఆరిజోనా లో 2024 జూన్ 19న ఎఎఎ ఫీనిక్స్‌‌లోని డీ బాంక్వెట్‌ హాల్లో ప్రారంభ సమావేశం నిర్వహించింది. ఈ సభలో దాదాపు 100కు పైగా హాజరై ఆంధ్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసించారు. కళ్యాణ్ గోట్టిపాటి బృందం ఆధ్వర్యం లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగ  పర్యవేక్షకునిగా వ్యవహరించారు. ఫీనిక్స్ ఎఎఎ  ప్రారంభ సమావేశం వాసు కొండూరు ఆకర్షణీయమైన ప్రసంగంతో మొదలైంది.

ఎఎఎ  నాయకత్వ బృందం హరి మోతుపల్లి ( సంస్థ వ్యవస్థాపకులు), బాలాజీ వీర్నాల (గవర్నింగ్ బోర్డు), కళ్యాణ్ కార్రీ (గవర్నింగ్ బోర్డు), రవి చిక్కాల (గవర్నింగ్ బోర్డు), గిరీష్ అయ్యప్ప (న్యూ జెర్సీ చాప్టర్ అధ్యక్షుడు), సత్య వేజ్జు (ప్రెసిడెంట్-ఎలెక్ట్, న్యూ జెర్సీ), వీరభద్ర శర్మ (పెన్సిల్వేనియా చాప్టర్ అధ్యక్షుడు), ప్రదీప్ సెట్టిబలిజ (డెలావేర్ చాప్టర్ అధ్యక్షుడు), హరి తూబాటి (డెలావేర్ ప్రెసిడెంట్-ఇలెక్ట్) ఎఎఎ లక్ష్యాలను వివరించారు. తెలుగు సంస్కృతి , సంప్రదాయాలను సంరక్షించడం, వాటి ప్రాముఖ్యతపై చర్చలు జరిగాయి. భోగి, సంక్రాంతి, ఉగాది, శ్రీరామ నవమి వంటి పండుగలలో ఉన్న ఏకత్వం, కలిసి ఉండే భావనపై వక్తలు ప్రసంగించారు. ఎఎఎ  ఈ గొప్ప సంస్కృతి వారసత్వ ఉత్సవాలని మరిన్ని నిర్వహించి భవిష్యత్తు తరాలకు అందించడం కోసం వేదికగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ  కార్యక్రమం లో కళ్యాణ్ గోట్టిపాటి, నాగ (న్యూ జెర్సీ), వసు కొండూరు, జయరాం కోడె, మధు అన్నె, నరేంద్ర పర్వతరెడ్డి, నాగేంద్ర వుప్పర, రమేష్ కుమార్ సురపురెడ్డి, రాజమోహన్ సందెళ్ళ, పుల్లారావు గ్రాంధి, సాయిబాబు, భాను పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events