Namaste NRI

అంగరంగ వైభవంగా దర్జా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

సునీల్‌, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దర్జా. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సలీమ్‌ మాలిక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శివ శంకర్‌ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా రవి పైడి పాడిపాటి వ్యవహరిస్తున్నారు. ఈ నెల 22న విడుదల కాబోతోంది. యూనిట్‌ ప్రీ రిలీజ్‌  ఈవెంట్‌ను నిర్వహించారు. బిగ్‌ టికెట్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాత నవీన్‌యెర్నేని విడుదల చేశారు. దర్శకుడు సలీమ్‌ మాలిక్‌ మాట్లాడుతూ స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే చిత్రమిది. చాలాకాలం తర్వాత ఇలాంటి కథ తెరపైకి వస్తుందని అన్నారు. నటి అనసూయ మాట్లాడుతూ ఈ సినిమాలో కనకం అనే పాత్రలో ఆకట్టుకుంటాను. మిమ్మల్ని భయపెట్టే క్యారెక్టర్‌ నాది. నాయికకు ప్రాధాన్యమున్న సినిమా దక్కడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పెన దర్శకుడు బుబ్బిబాబు, గంధర్వ హీరో సందీప్‌ మాదవ్‌, దర్శకుడు వీరశంకర్‌, ఉత్తేజ్‌, చిట్టిబాబు, నాగమహేష్‌, షఫీ కుమనన్‌ సేతురామన్‌, వెంపక శ్రీను , జర్నలిస్టు ప్రభుతోపాటు కరీంనగర్‌ సిటీ కమిషనర్‌ సత్యనారాయణ, యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events