రణబీర్‌కపూర్ హీరోగా నటిస్తున్న చిత్రం యామిమల్. రష్మిక మందన కథానాయిక. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ఇందులో అనిల్‌కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో అనిల్‌కపూర్ పాత్ర పేరు బల్బీర్‌సింగ్ అని రివీల్ చేశారు. అనిల్ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో గెటప్‌ని బట్టి మేకర్స్ చెప్పకనే చెప్పేశారు. ఈ చిత్రంలో బాబీడియోల్, త్రిప్తీ డిమ్రీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1 డిసెంబర్ 2023న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం – 5 భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు నిర్మాతలు : భూషణ్‌కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా, నిర్మాణం టి.సిరీస్, భద్రకాళి పిక్చర్స్.