కిరణ్ అబ్బవరం, అతుల్య రవి జంటగా నటిస్తున్న సినిమా మీటర్. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం. డైరెక్టర్ అనిల్ రావిపూడి మీటర్ సెకండ్ సింగిల్ ఓ బేబీ లిరికల్ వీడియోను లాంచ్ చేశారు. సాయి కార్తీక్ లైవ్లీ బీట్లతో లవ్లీ నెంబర్ ని కంపోజ్ చేశారు. బాలాజీ సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ధనుంజయ తన వాయిస్ తో మస్మరైజ్ చేశారు. ఈ పాట కిరణ్ అబ్బవరం అతుల్య రవిపై ప్రేమను వర్ణిస్తుంది. అయితే ఆమెకు మొదట్లో అలాంటి ఫీలింగ్స్ లేవు. అతని ప్రయత్నాలు ప్రేమని అంగీకరించేలా చేస్తాయి. కిరణ్ అబ్బవరం పాటలోజాయ్ ఫుల్ గా కనిపించాడు. పాటలో కిరణ్ డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. అతుల్య చాలా అందంగా కనిపించింది.
వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రాఫర్ కాగా, జెవి ఆర్ట్ డైరెక్టర్. అలేఖ్య లైన్ ప్రొడ్యూసర్ కాగా, బాబా సాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. కిరణ్ కెరీర్లోనే అత్యంత ఖరీదైన సినిమాగా రూపొందిన ఈ చిత్రానికి బాల సుబ్రమణ్యం కెవివి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 7న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.