రంజిత్, సౌమ్య మేనన్ జంటగా తెరకెక్కిన చిత్రం లెహరాయి. ఈ సినిమాలోని అరే చెప్పకు రా మామ.. నువ్వు చెప్పకు సారీ అంటూ సాగే పాటని విడుదల చేశారు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి. ఇందులో ఏడు పాటలున్నాయి. ప్రతి పాట దేనికదే వైవిధంగా ఉంటుంది. 90వ దశకంలో ట్రెండిరగ్ పాటల్ని అందించిన ఘంటాడి కృష్ణ మళ్లీ తనదైన ముద్ర వేస్తూ బాణీల్ని అందించారు. పలువురు దర్శకుల దగ్గర పనిచేసిన రామకృష్ణ పరమహంస మంచి అనుభూతిని పంచేలా ఈ సినిమా తీశారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని సినీ వర్గాలు తెలిపాయి. గగన్ విహారి, రావు రమేష్, నరేష్, అలీ, సత్యం రాజేశ్, జబర్దస్త్ రాంప్రసాద్ తదితరులు నటిస్తున్నారు. రామ కృష్ణ పరమహంస దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మాత. బెక్కం వేణుగోపాల్ సమర్పకులు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : ఎం.ఎన్. బాల్‌రెడ్డి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)