ఇండియన్ సినిమా హిస్టరీలోనే ది మోస్ట్ వైలెంట్ సినిమాగా తెరకెక్కుతున్న మూవీ యానిమల్. ఒక్క పోస్టర్ తోనే సినిమాపై తిరుగులేని హైప్ వచ్చిందంటే ఆశా మాశీ కాదు. రణ్బీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా చేస్తున్నాడు. మరో రెండు నెలల్లో విడుదల కానున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తు్ంది. బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్, రణ్బీర్ కు ఫాదర్ గా కనిపించనున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ను చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా ప్రీ టీజర్ ను జూన్ 11 ఉదయం 11 గంటల 11 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ ఉంది. ఇక ఇప్పుడు ప్రీ టీజర్ హైప్ ను మరో స్థాయికి తీసుకెళ్తుందని చిత్రబృందం ధీమాగా ఉంది. ఇటీవలే రణ్బీర్ కపూర్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు లీకై నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అందులో క్లీన్ షేవ్ తో ఉన్న రణ్బీర్ లుక్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో రణ్బీర్ ఫిజిక్స్ లెక్చరర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. రివేంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 11న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.