శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ఒకే ఒక జీవితం. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ సంస్థ నిర్మించింది. అక్కినేని అమల కీలక పాత్రను పోషించిన ఈ చిత్రం ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ట్రైలర్‌ను సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ విడుదల చేశారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తల్లీకొడుకుల జీవితంలో సంఘర్షణను ఆవిష్కరిస్తూ ట్రైలర్ ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సుజిత్ సారంగ్, సంగీతం: జేక్స్ బిజోయ్, సంభాషణలు: తరుణ్ భాస్కర్, నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, రచన`దర్శకత్వం శ్రీకార్తిక్.