Namaste NRI

విశాల్‌కి జోడీగా అంజలి

అగ్రహీరో విశాల్‌ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మకుటం. సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఆర్బీ చౌదరి నిర్మిస్తున్నారు. అంజలి ఇందులో విశాల్‌కి జోడీగా నటిస్తున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ, అంజలి, విశాల్‌ కలిసి ఓ కాన్సెప్ట్‌ వీడియోని విడుదల చేశారు. అంజలికి కథ చెప్పేందుకు ఒక దర్శకుడిగా విశాల్‌ వెళ్లడంతో ఈ వీడియో మొదలైంది. వీడియోలో ఇద్దరి సంభాషణ సెటైర్లతో ఫన్‌గా సాగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నదని మేకర్స్‌ తెలిపారు. విశాల్‌ హీరోగా నటిస్తూ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని కూడా నిర్వర్తిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సివుంది.

Social Share Spread Message

Latest News