నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా మాచర్ల నియోజకవర్గం. కృతిశెట్టి, కేథరీన్ ట్రెసా నాయికలుగా నటిస్తున్నారు. పొలిటికల్ డ్రామాతో మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నది. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నాయిక అంజలి మెరుపులు మెరిపించనుంది. పాటలోని ఆమె లుక్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ సినిమాలో అంజలి పాట మాస్‌ను బాగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం చెబుతున్నారు. హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో ఆ పాటని తెరకెక్కించామని సినీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా సమాతంరంగా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నది. నితిన్ యువ ఐఏఎస్ అధికారిగా సందడి చేయనున్నారు. ఆగస్టు 12న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. రాజ్ కుమార్ ఆకెల్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఎం.ఎస్ రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: మహతి స్వరసాగర్, సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల, మాటలు: మామిడాల తిరుపతి, కళ: సాహి సురేష్.
