
మానవ జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపే అన్నమయ్య సంకీర్తలను పాఠ్యాంశాల్లోనూ చేర్చాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ విషయాన్ని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల దృష్టికి సైతం తీసుకెళుతానని చెప్పారు. హైదరాబాద్లోని మాదాపూర్ అన్నమయ్య పురం అన్నచార్య భావనా వాహినిలో నాదబ్రహ్మోత్సవ్` 2025 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నేటితరం వస్త్రధారణతోపాటు పిల్లల పేర్లు, సినిమాలు స్ఫూర్తి నింపేలా ఉండాలని సూచించారు. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ లక్ష్యం సాధించేందుకు ప్రణాళికతోపాటు ఆచరణ కూడా ముఖ్యమని తెలిపారు. తల్లిదండ్రులు గర్వపడేలా పిల్లలు ఎదగాలని, తాము చదువుకున్న విద్యాలయాలకు ముఖ్య అతిథిగా వెళ్లే స్థాయికి వారు చేరుకోవాలని సూచించారు. అనంతరం చదరంగం క్రీడాకారిణి కోనేరు హంపికి ధైర్య పురస్కారాన్ని ప్రధానం చేశారు. అన్నమాచార్య భావనా వాహిని మేనేజింగ్ ట్రస్ట్ నందకుమార్ పాల్గొన్నారు.
















