Namaste NRI

అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఫస్ట్ లిరికల్ సాంగ్ రంగమ్మ

చైతన్య రావు హీరోగా, లావణ్య హీరోయిన్ గా నటిస్తోన్న సినిమాఅన్నపూర్ణ ఫొటో స్టూడియో చిత్రం. ఇచ్చట ఫొటోలు అందంగా తీయబడును అనేది ట్యాగ్ లైన్.  చందూ ముద్దు డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతోంది. మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య తదితరులు కీలక పాత్రలు చేసారు. ఈ సినిమా నుంచి, తాజాగా రంగమ్మా .. రంగమ్మా అనే ఫస్టు సింగిల్ ను ప్రియదర్శితో రిలీజ్ చేయించారు. కంటిచూపు నిన్నుతాకి పోనంటుందమ్మా .. కొంటె ఆశలేవో రేగి అదిరిందే బొమ్మ  అంటూ ఈ పాట సాగుతోంది. ప్రిన్స్ హెన్రీ సంగీతాన్ని అందించిన ఈ పాటకి శ్రీనివాస మౌళి సాహిత్యాన్ని అందించగా, ఎస్పీ చరణ్ ఆలపించారు. ఈ పాట కూడా 1980 నేపథ్యంలో నడుస్తోంది. ఆ కాలం నటి కాస్ట్యూమ్స్ తోనే హీరో, హీరోయిన్స్ ఇద్దరూ కనిపిస్తున్నారు. ఈ పాటను చూస్తుంటే ఒకప్పటి జంధ్యాల సినిమాలలోని పాటలు గుర్తుకొస్తున్నాయి. ఆ తరహాలోనే ఈ పాటను చిత్రీకరించారు. యశ్ రంగినేని నిర్మిస్తున్నారు.  గతంలో విడుదలైన ఈ మూవీ మోషన్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events