Namaste NRI

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే

దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్టుల ప్రదానోత్సవం రాత్రి ముంబయిలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్‌ తారలు, దర్శకనిర్మాతలు హాజరయ్యారు. జవాన్‌ చిత్రానికిగా ను బాలీవుడ్‌ అగ్ర హీరో షారుఖ్‌ఖాన్‌ ఉత్తమ నటుడిగా, చిత్ర కథానాయిక నయనతార ఉత్తమ నటిగా అవార్డు లను స్వీకరించారు. గత డిసెంబర్‌లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన యానిమల్‌ చిత్రానికిగాను సందీప్‌ రెడ్డి వంగా ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు.

విలన్ పాత్రలో ఉత్తమ నటుడిగా బాబీ డియోల్ (యానిమల్‌) అవార్డు అందుకున్నారు. క్రిటిక్స్‌ ఉత్తమ నటుడి గా విక్కీ కౌశల్‌ (సామ్‌ బహదూర్‌), ఉత్తమ గీత రచయితగా జావేద్‌ అక్తర్‌ (నిక్లే ది కభి హమ్‌ ఘర్‌సే ధున్కీ), ఉత్తమ సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ రవిచందర్‌ అవార్డు అందుకున్నాడు. ఇక ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (మేల్) గా వరుణ్‌ జైన్‌, ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (ఫీమేల్)గా శిల్పా రావు ఎంపికయ్యారు. ఇక ఔట్‌ స్టాండిం గ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ మ్యూజిక్‌ ఇండస్ట్రీ అవార్డు యేసుదాసుకి, ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ ఫిల్మ్‌ ఇండ స్ట్రీ అవార్డ్ మౌషుమీ ఛటర్జీలకు దక్కాయి. టీవీ విభాగం విషయానికి వస్తే టెలివిజన్‌ సిరీస్‌ ఆఫ్‌ది ఇయర్‌‌ గా ‘ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌’ నిలిచింది. ఉత్తమ నటుడిగా ‘నెయిల్‌ భట్ (ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌), ఉత్తమ నటిగా రూపాలీ గంగూలీ (అనుపమ) అవార్డులు అందుకున్నారు. ఇక వెబ్‌సిరీస్‌ విభాగంలో క్రిటిక్స్‌ ఉత్తమ నటిగా కరిష్మా తన్నా (స్కూప్‌) నిలిచారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events