2021 ఏడాదికి గాను డాక్టర్ రామినేని ఫౌండేషన్ పురస్కారాలను నిర్వాహకులు ప్రకటించారు. భారత్ బయోటెక్ సీఎండీ, జేఎండీలు డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్ల, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, నిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ దుర్గ, ప్రముఖ సినీ పాత్రికేయుడు ఎస్వీ రామారావులకు విశేష సేవా పురస్కారం దక్కింది. త్వరలోనే పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం పేర్కొన్నారు. 2020 సంవత్సరానికి సైతం అవార్డులను ప్రకటించామని, కరోనా మహమ్మారి నేపథ్యంలో అవార్డుల ప్రదానోత్సవం జరగలేదని, ఈసారి ఒకే వేదికపై రెండు సంవత్సరాలకు సంబంధించిన పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)