Namaste NRI

టాలీవుడ్‌లోకి మరో బాలీవుడ్‌ బ్యూటీ ఎంట్రీ

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుంది. తాజాగా ఆమె న‌టిస్తున్న ప్రాజెక్ట్ నుంచి మేక‌ర్స్ అప్‌డేట్ ఇచ్చారు.   సుధీర్‌బాబు హీరోగా  న‌టిస్తున్న తాజా చిత్రం జటాధర. వెంకట్‌ కల్యాణ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్నది. తెలుగు, హిందీ బైలింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రాబోతుంది.

మహిళా దినోత్సవం సందర్భంగా సోనాక్షి సిన్హా లుక్‌ను విడుదల చేశారు. యాక్షన్‌, ఆధ్యాత్మిక, అతీంద్రియ అంశాల కలబోతగా ఓ సరికొత్త ప్రపంచం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, విజువల్‌ ఎఫెక్ట్స్‌ అబ్బురపరుస్తాయని, ఈ నెల 10 నుంచి సోనాక్షి సిన్హా షూటింగ్‌లో జాయిన్‌ అవుతారని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌ పతాకంపై ఉమేష్‌ కెఆర్‌ బన్సాల్‌, ప్రేరణ అరోరా, అరుణ అగర్వాల్‌, శివిన్‌ నారంగ్‌ నిర్మిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events