Namaste NRI

కాజల్ అగర్వాల్ కు మ‌రో బంఫ‌రాఫ‌ర్

ప్రముఖ నటి కాజల్ అగర్వాల్  తాజాగా మ‌రో బంఫ‌రాఫ‌ర్ కొట్టిన‌ట్లు తెలుస్తుంది. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం రామాయణ‌లో కాజ‌ల్ ఛాన్స్ కొట్టేసిన‌ట్లు తెలుస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాలో కాజల్ రావణుడి భార్య మండోదరి పాత్రలో కనిపించనున్నారు.

రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి ఖరారయ్యారు. ఇప్పుడు మండోదరి పాత్ర కోసం కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రామాయణం వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో మండోదరి వంటి బలమైన పాత్రలో ఆమె ఎలా మెప్పిస్తారో చూడాలి. మండోదరి పాత్ర రామాయణంలో ఒక ముఖ్యమైన పాత్ర. ఆమె రావణుడికి మంచి సలహాలు ఇస్తూ, ధర్మం వైపు నిలబడే ప్రయత్నం చేస్తుంది. తన భర్త తప్పులను ఎత్తిచూపుతూ, సీతను తిరిగి రాముడికి అప్పగించాలని సూచిస్తుంది. కాబట్టి, ఈ పాత్రకు కాజల్ వంటి అనుభవం ఉన్న నటి అయితే మరింత న్యాయం చేకూరుస్తుందని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే, ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే, కాజల్ అగర్వాల్ కెరీర్‌లో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events