Namaste NRI

పారిస్‌ ఒలింపిక్స్‌లో మరో వివాదం

ప్రతిష్ఠాత్మక పారిస్‌ ఒలింపిక్స్‌లో మరో వివాదం రాజుకుంది.  మహిళల బాక్సింగ్‌ పోటీల్లో పురుష లక్షణాలు ఉన్న వాళ్లను అనుమతించి అభాసుపాలయ్యారు. విశ్వక్రీడల్లో మహిళల బాక్సింగ్‌ పోటీలు హాట్‌ టాపిక్‌గా మారాయి. మహిళల 66కిలోల బౌట్‌ ఇందుకు కారణమైంది. అల్జీరియాకు చెందిన ఇమానె ఖెలిఫ్‌, ఇటలీ బాక్సర్‌ ఎంజెలా కెరినీ మధ్య బౌట్‌ అగ్నికి ఆజ్యం పోసింది. తన తండ్రి కలను సాకారం చేసేందుకు కొన్ని ఏండ్లుగా కఠోర శిక్షణ తీసుకున్న కెరినీ, పారిస్‌లో పతకాన్ని ముద్దాడాలన్న లక్ష్యంతో బరిలోకి దిగింది. కానీ ఆమె ఆశలు ఖెలిఫ్‌ రూపంలో ఆదిలోనే ఆవిరయ్యాయి. బౌట్‌ మొదలైన 46 సెకన్ల వ్యవధిలోనే కెరినీ కన్నీటి పర్యంతం అవుతూ ఓటమికి ఒప్పుకుంది.

అసలు ఏం జరిగింది అని తెలుసుకునేలోపే జరుగాల్సిన నష్టం జరిగిపోయింది. తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఎదుర్కొని పవర్‌ఫుల్‌ పంచ్‌లను ఎదుర్కొవడంతో బాధకు గురైన కెరినీ బౌట్‌లో కన్నీరు కారుస్తూ కుప్ప కూలిపోయింది. తన కోచ్‌తో మాట్లాడి బౌట్‌లో కొనసాగలేనంటూ రింగ్‌ను వీడింది. ఎంజెలా కెరినీ, ఇమానె ఖెలిఫ్‌ మధ్య బాక్సింగ్‌ పోరు ప్రస్తుతం పారిస్‌ ఒలింపిక్స్‌ను షేక్‌ చేస్తున్నది. టెస్టోస్టిరాన్‌(పురుష లక్షణాలు) ఎక్కువ ఉన్న ఖెలిఫ్‌కు ఎలా అనుమతిచ్చారంటూ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐవోసీ)పై అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events