టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ కుదిరింది. బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఎస్‌బీకే 108వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, డబుల్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడిల క్రేజీ కాంబినేషన్‌లో ఎస్‌బీకే 108 సినిమా రూపొందనుంది. ఇందులో బాలకృష్ణ ఐదు పదుల వయసున్న తండ్రిగా కనిపించనున్నారని, ఆయన కూతురుగా శ్రీలీల నటించనుందని గతంలో చిత్ర దర్శకుడు ప్రకటించారు. ప్రియమణి ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు వినూత్న కథనంతో భారీ ఎత్తున ఈ చిత్రం తెరకెక్కనుంది. మాస్ పల్స్ తెలిసిన అనిల్ రావిపూడి, మునుపెన్నడూ చూడని పాత్రలో బాలకృష్ణను చూపించేందుకు పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రెడీ చేశారు అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
