Namaste NRI

అందాల పోటీల్లో భారత్‌కు మరో కిరీటం..మిస్‌ టీన్‌ యూనివర్స్‌గా తృష్ణా రే

ఈ ఏడాదికిగాను మిస్‌ టీన్‌ యూనివర్స్ కిరీటాన్ని భారత్‌కు చెందిన తృష్ణా రే దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికా లోని క్లింబరీ వేదికగా ఈ అందాల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పెరూ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, కెన్యా, పోర్చుగల్‌, నమీబియా, నెదర్లాండ్స్‌ సహా వివిధ దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొన్నారు. పోటీల్లో ఉన్న అందరినీ వెనక్కినెట్టి 19 ఏళ్ల తృష్ణా రే మిస్‌ టీన్‌ యూనివర్స్‌ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. పెరూకు చెందిన అన్నే థోర్సెన్‌, నమీబియాకు చెందిన ప్రెషియస్‌ ఆండ్రీ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

తృష్ణా రే కల్నల్‌ దిలీప్‌ కుమార్‌ రే, రాజశ్రీ రేల కుమార్తె. ఆమె ఒడిశా రాష్ట్రానికి చెందిన యువతి. ప్రస్తుతం భువనేశ్వర్‌లో కేఐఐటీ యూనివర్సిటీలో ఫ్యాషన్‌ టెక్నాలజీ చదువుతున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన మిస్‌ టీన్‌ యానివర్స్‌ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచిన తృష్ణా,  తాజాగా అంతర్జాతీయ వేదికపై జరిగిన పోటీల్లోనూ విజయం సాధించారు. నవంబర్ 1 నుంచి 9 వరకు పోటీలు జరిగాయి. ఈ పోటీలో ప్రపంచం నలుమూలల నుండి పోటీదారులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]