Namaste NRI

తెలంగాణ‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి…  మ‌హేష్ బిగాల

తెలంగాణ  ముఖ్య‌మంత్రి కేసీఆర్ దూర‌దృష్టి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్  ఆలోచ‌న‌ల‌తో తెలంగాణ శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతుంద‌ని గ్లోబ‌ల్ బీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేట‌ర్ మ‌హేష్ బిగాల స్ప‌ష్టం చేశారు. టీ వ‌ర్క్స్  ప్రారంభంతో హార్డ్‌వేర్ రంగంలో తెలంగాణ యువ‌త అద్భుతాలు సృష్టించే అవ‌కాశం ఉంద‌న్నారు. ఇప్ప‌టికే టీ హబ్ ద్వారా సాఫ్ట్‌వేర్ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నార‌ని గుర్తు చేశారు. గ్రామీణ ఔత్సాహిక యువ‌త క్రియేటివిటీ వృధా కావొద్దనే ఉద్దేశంతో టీ వ‌ర్క్స్‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప్రారంభించింద‌ని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ తీసుకుంటున్న చ‌ర్య‌ల వ‌ల్ల రాష్ట్రానికి పెట్టుబ‌డులు త‌ర‌లివ‌స్తున్నాయ‌న్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి వ‌చ్చింద‌ని తెలిపారు. ఫాక్స్‌కాన్ సంస్థ పెట్టుబ‌డుల నేప‌థ్యంలో రాష్ట్రంలో ల‌క్ష మంది యువ‌త‌కు ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయ‌ని పేర్కొన్నారు. భారీ స్థాయిలో పెట్టుబ‌డులు పెట్ట‌బోయే ఫాక్స్ కాన్,  తెలంగాణ ప్ర‌భుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంద‌ని మ‌హేష్ బిగాల తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events