ఉక్రెయిన్ రష్యా మధ్య దాడులు కొనసాగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా దేశాలు రష్యా మీద అనేక ఆంక్షలు విధిస్తుంటే, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఆపిల్ వంటి దిగ్గజ కంపెనీలు ఆ దేశంలో తమ వ్యాపార కార్యకలాపాలను నిలివేస్తున్నాయి. అయితే తాజాగా మరో దిగ్గజ చిప్ మేకర్ కంపెనీ క్వాల్‌కామ్ అమెరికా విధించిన ఆంక్షలను అనుగుణంగా రష్యన్ కంపెనీలకు తన ఉత్పత్తులను విక్రయిచడం నిలిపివేసినట్లు తెలిపింది. క్వాల్‌కామ్ కంపెనీ సీనియర్ ప్రభుత్వ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ నేట్ టిబ్బిట్స్ ఈ నిర్ణయాన్ని ట్వీటర్ వేదికగా వెల్లడిరచారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)