Namaste NRI

ఆర్‌ఆర్‌ఆర్‌కు మరో  అంతర్జాతీయ పురస్కారం

జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఆర్‌ఆర్‌ఆర్‌ ఇప్పుడు ప్రపంచ సినిమా వేదికపైనా సత్తా చాటుతోంది.  ఇందులో భాగంగా తాజాగా ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌ 2023కి నామినేట్‌ అయ్యింది.  ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు అద్భుతమైన స్కోర్‌ అందించిన లెజండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణిని లాస్‌ ఏంజెల్స్‌ ఫిలిమ్స్‌ క్రిటిక్స్‌అసోసియేషన్‌ బెస్ట్‌ మ్యూజిక్‌/ స్కోర్‌ విభాగంలో విన్నర్‌గా ప్రకటించింది. ఆర్‌ఆర్‌ఆర్‌ ఇప్పటికే సటర్న్‌ అవార్డ్‌ ( ప్రతిష్టాత్మక అమెరికన్‌ అవార్డు)లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డు అందుకుంది.  ఆ తర్వాత ఇదే కేటగిరిలో సన్‌సెట్‌ సర్కిల్‌ అవార్డు గెలుచుకుంది. రీసెంట్‌గా  జపాన్‌లో అత్యధిక గ్రాస్‌ సాధించిన ఇండియన్‌ మూవీ ముత్తు సినిమాపై ఉన్న రికార్డును అధిగమించింది ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్‌ నటించగా, ఎన్టీఆర్‌ కొమ్రంభీం పాత్రలో నటించాడు. అలియాభట్‌, అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియాశరణ్‌, ఒలివియా మొర్రీస్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరక్కించారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events