వలసదారులను ముప్పుతిప్పలు పెడుతున్న గల్ఫ్ దేశం కువైత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ దేశ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (పీఏఎం) తాజాగా కీలక ప్రకటన చేసింది. వలసదారులు ఎవరైతే వర్క్ పర్మిట్ల పై దేశానికి వచ్చి రెసిడెన్సీ ప్రాసెస్‌ను పూర్తి చేయలేదో వారిపై పరారీ కేసులు నమోదు చేయనున్నట్లు పేర్కొంది. దీనిలో భాగంగా ఆశల్ పోర్టల్‌లో కొత్త ఫీచర్‌ను ప్రారంభించినట్లు పీఏఎం వెల్లడిరచింది. నివాస విధానాలను పూర్తి చేయని ప్రవాస కార్మికులకు గుర్తించి వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిని పట్టుకోవడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పీఏఏం పేర్కొంది. ఇకపై కువైత్‌లోని వలస కార్మికులు ఈ విషయంలో అప్రమత్తంగా లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. అందుకే వర్క్ పర్మిట్లపై కువైత్ వెళ్లే ప్రవాస కార్మికులు వెంటనే రెసిడెన్సీ విధానాలను పూర్తి చేయడం బెటర్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)