Namaste NRI

బైడెన్‌ సర్కారు మరో కీలక నిర్ణయం

రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఇప్పటికే  ఉక్రెయిన్‌కు అనుమతి ఇచ్చి సంచలన నిర్ణయం తీసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, మరో నిర్ణయంతో ఉద్రిక్త పరిస్థితులకు మరింత ఆజ్యం పోశారు. ఉక్రెయిన్‌కు తొలిసారిగా యాంటీ పర్సనల్‌ మైన్లను పంపడానికి బైడెన్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది బైడెన్‌ పాలనలో మరో ప్రధాన విధాన, సంచలన నిర్ణయంగా భావిస్తున్నారు. ఉక్రెయిన్‌ రక్షణాత్మక ప్రాంతాల లో రష్యా దళాలు నెమ్మదిగా, నిదానంగా వస్తుండటంతో ఈ యాంటీ పర్సనల్‌ మైన్లను కీవ్‌ తమ దేశంలోని తూర్పు ప్రాంతంలో వినియోగించనుంది.

యాంటీ పర్సనల్‌ మైన్లు లేదా యాంటీ పర్సనల్‌ లాండ్‌ మైన్లు (ఏపీఎల్‌)గా వ్యవహరించే వీటితో భారీగా సైనికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. అయితే ఈ యాంటీ పర్సనల్‌ మైన్లను తమ దేశ రక్షణకు తమ దేశ భూభాగంలోనే మాత్రమే వినియోగించాలని, వీటిని శత్రుదేశాలపై దాడికి ప్రయోగించరాదని బైడెన్‌ ప్రభుత్వం పేర్కొంది. అలాగే వీటి ద్వారా పౌరులకు జరిగే ప్రమాదాన్ని తక్కువకే పరిమితం చేస్తామని ఉక్రెయిన్‌ నుంచి హామీ పొందినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

Social Share Spread Message

Latest News