కోవిడ్ యాంటీవైరల్ డ్రగ్స్ ఔషధాల కొరతను తీరుస్తూ శక్తివంతమైన యాంటివైరల్ ఔషధాలను ప్రవేశపెట్టినట్లు ఆప్టిమస్ ఫార్మా ఎండీ, చైర్మన్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కోవిడ్ రోగులపై నిర్వహించిన మోల్పుపిరావిర్ క్యాప్యూల్స్ మూడవ దశ క్లినికల్ ట్రయల్ ప్రోటోకాల్ ప్రకారం తేలికపాటి కోవిడ్ 19 ఉన్న 1218 మందిని 1:1 నిష్పత్తిలో పరిశీలించామన్నారు. చికిత్స వ్యవధి గరిష్టంగా 5 నుంచి 28 రోజులు ఉంటుందన్నారు. ఆప్టిమస్ భారతదేశంలో కోవిడ్ 19 రోగుల కోసం మోల్నుపిరవిర్ తయారీని వెంటనే ప్రారంభించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా 353 మంది రోగులపై నిర్వహించిన ప్రయోగాలకు సంబంధించిన మోల్నుపిరవిర్ మధ్యంతర ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయన్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో 78.3 శాతం నెగిటివ్ వచ్చేలా సాయ పడుతుందన్నారు. 10 రోజు, 14 రోజు ఈ ఔషధలు అద్భుతమైన పని తీరును కనబర్చడంతో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగిటివ్ ఫలితాలు వచ్చేలా పని చేస్తున్నాయన్నారు. దీనికి తోడు అనంతరం రోగి ఆరోగ్యం మంచి మెరుగుదల కనిపిస్తుండటాన్ని క్లినికల్ ట్రయల్స్‌లో గమనించామన్నారు. చికిత్స వ్యవధిలో, తర్వాత గమనించిన దుష్ప్రభావాలు, అనారోగ్యం దరిచేరకుండా కాపాడుతుందన్నారు.