Skip to main content

Namaste NRI

వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ ట్రైలర్‌‌‌‌ రిలీజ్

ఆర్జే కాజల్‌, అఖిల్‌ సార్థక్‌, శుభశ్రీ, మిర్చి కిరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ వేరే లెవెల్‌ ఆఫీస్‌. ఇ.సత్తిబాబు దర్శకుడు. వరుణ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వరుణ్‌ చౌదరి గోగినేని నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 12 నుంచి ఈ సిరీస్‌ ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఇ.సత్తిబాబు సిరీస్‌ విశేషాలు తెలియజేస్తూ తమిళంలో వేరే మాదిరి ఆఫీస్‌ వెబ్‌ సిరీస్‌కు మంచి పేరొచ్చింది. దానిని 50 శాతం మార్పులతో తెలుగులోకి తీసుకొచ్చాం. యువతతో పాటు కార్పొరేట్‌ ఉద్యోగులకు ఈ సిరీస్‌ బాగా కనెక్ట్‌ అవుతుంది అన్నారు.

Social Share Spread Message

Latest News