తెలుగు తెరపైకి మరో కొత్త నాయిక రాబోతున్నది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్‌పై నిర్మాత కేకే రాధామోహన్ తమ బ్యానర్ నుండి ప్రొడక్షన్ నంబర్ 10గా పూర్తి వినోదాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మలయాళం, తమిళంలో పలు చిత్రాల్లో నటించిన మిర్నా మీనన్ టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నది. యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న కొత్త సినిమాలో ఒక నాయికగా దిగాంగన సూర్య వంశీని ఎంపికయ్యారు. తాజాగా మరో హీరోయిన్‌గా మిర్నా మీనన్‌ను ఎంపిక చేశారు. కుటుంబ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్నది. దిగాంగన సూర్యవంశీతో పాటు మిర్నా మీనన్ నాయికగా ఉంటుందని, కథలో ఇద్దరు పాత్రలూ కీలకంగా ఉంటాయని చెబుతున్నారు దర్శకుడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కేకే రాధామోహన్ నిర్మాత. ఈ చిత్రంలో ఫణికృష్ణ సిరికి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ధృవన్, సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, ఎడిటర్: జి సత్య, యాక్షన్ : రామకృష్ణ.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)