హైదరాబాద్ చుట్టూర రియల్ ఎస్టేట్ రంగం విసృత స్థాయిలో విస్తరిస్తోంది. ప్రముఖ్ రియల్ ఎస్టేట్ సంస్థ సుచిర్ ఇండియా సంస్థ ద టేల్స్ ఆఫ్ గ్రీక్ లగ్జరీ సూట్లు, స్టూడియో అపార్టుమెంట్లను శంషాబాద్ సమీపంలోని సాతంరాయి ప్రాంతంలో ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును ప్రముఖ హీరోయిన్ అక్కినేని సమంత లాంఛనంగా ప్రారంభించారు. 2.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ద టేల్స్ ఆఫ్ గ్రీక్‌లో గేటెడ్ కమ్యూనిటీ పరిధిలో లగ్జరీ సూట్లు, స్టూడియో అపార్టుమెంటు ఉంటాయి. వీటికి గ్రీకు సంప్రదాయాలతో పాటు అత్యాధునిక సదుపాయాలు కూడా ఉండటంతో ఇది ఒక విభిన్నమైన ప్రాజెక్టుగా రూపొందింది. ఈ ప్రాజెక్ట్‌లో 6 లక్షల చదరపు అడులు బిల్టప్ ఏరియాలో మొత్తం 398 గృహాలుంటాయని సుచిరిండియా చైర్మన్ డాక్టర్ కిరణ్ తెలిపారు. 800`945 చదరపు అడుగుల మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. మూడంతస్తులలో క్లబ్ హౌస్‌తో పాటు స్విమ్మింగ్ పూల్, జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఫార్మసీ వంటి వసతులుంటాయి.