మైక్రోసాఫ్ట్ సీఈఓ, సత్య నాదెళ్ల మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. కార్పొరేట్ ఎకో ఫోరం (సీఈఎఫ్) ఏటా ఇచ్చే సీకే ప్రహ్లాద్ అవార్డ్ ఫర్ గ్లోబల్ బిజినెస్ సస్టెయినబిలిటీ లీడర్‌షిప్ అవార్డుకు నాదెళ్ల ఎంపికయ్యారు. పర్యావరణ సానుకూలత, సృజనాత్మకత, దీర్ఘకాలిక వాణిజ్య విజయాలు, ఈ మూడిరటి ప్రతిపాదికగా కార్పొరేట్ లీడర్లను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రెసిడెంట్, వైస్ చైర్మన్ బ్రాడ్ స్మిత్, చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ అమి హుడ్, చీఫ్ ఎన్విరాన్‌మెంట్ ఆఫీసర్ లుకాస్ జొప్పాలతో కలిసి నాదెళ్ల ఈ అవార్డు అందుకున్నారు. భారతీయ అమెరికన్ వాణిజ్యవేత్త ప్రహ్లాద్ స్మృత్యర్థం కార్పొరేట్ ఎకో ఫోరం (సీఈఎఫ్) వీటిని ఏర్పాటు చేసింది.