దుబాయ్‌లోని మడమే టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం కొలువుదీరనుంది. ఈ మేరకు మ్యూజియం ప్రతినిధులు అల్లు అర్జున్ కొలతలు తీసుకున్నారు. అల్లు అర్జున్‌కు సంబంధించి సుమారు 200కుపైగా (ముఖం, బాడీ) కొలతలు తీసుకున్నారట. ఈ ఏడాది తర్వాత మైనపు విగ్రహాన్ని లాంఛ్ చేయనున్నారు. చిన్నప్పుడు ఈ మ్యూజియాన్ని సందర్శించానని, తన విగ్రహమే ఇక్కడ ఏర్పాటు చేస్తారని ఎప్పుడూ అనుకోలేదని తన ఎక్జయిట్‌మెంట్‌ను అందరితో షేర్ చేసుకున్నాడు బన్నీ. ఈ మ్యూజియంలో మైనపు విగ్రహం ఏర్పాటు చేసుకోబోతున్న తొలి తెలుగు హీరోగా అత్యంత అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు బన్నీ.
