ఐక్యరాజ్య సమతిలో భారత్ మరో గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఐరాస విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో)లోని ప్రపంచ వారసత్వ కమిటీ సభ్య దేశంగా ఎన్నికైంది. 2025 వరకు అందులో కొనసాగనుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి భారత్ ఈ కమిటీలో చోటు దక్కించుకున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి వెల్లడిరచారు. 2021`25 కాలానికి యునెస్కో కార్యనిర్వాహక బోర్డులో సభ్య దేశంగా భారత్ మరోసారి ఎన్నికైన సంగతి గమనార్హం.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)