భారతీయ మూలాలున్న ప్రఖ్యాత అంతరిక్ష యాత్రికురాలు, అమెరికా నావికాదళ రిటైర్డ్ కెప్టెన్ అయిన సునీతా విలియమ్స్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అమెరికాలో మాజీ సైనికోద్యోగుల సేవలను ఘనంగా స్మరించుకుంటూ నిర్వహించే ప్రఖ్యాత వెటరన్స్ డే పరేడ్ వేడుకకు ఆమె గ్రాండ్ మార్షల్ హోదాలో వ్యవహరించారు. న్యూయార్క్‌లోని మాన్హాటన్ ఫిఫ్త్ అవెన్యూలో ఈ భారీ పరేడ్ అత్యంత వైభవంగా నిర్వహించబడింది.

దాదాపు 20,000 మందికి పైగా మాజీ సైనికులు, విద్యార్థులు పాల్గొన్న ఈ భారీ పరేడ్‌కు సునీతా విలియమ్స్ నాయకత్వం వహించారు. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ గ్రాండ్ మార్షల్‌గా వ్యవహరించడం తన జీవితంలో ఎంతో గర్వకారణమైన విషయమని అన్నారు. నావికాదళంలో తాను గడిపిన అమూల్యమైన కాలమే తనను ఈ స్థాయికి చేర్చిందని, భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతి క్లిష్టమైన సవాలునూ ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని అదిరిచ్చిందని తెలిపారు. ప్రతి తరానికి చెందిన సైనికుల త్యాగాలను గౌరవించే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె వెల్లడించారు.















