టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖులకు యూఏఈ ప్రభుత్వం అందించే గోల్డెన్ వీసా అందుకుంది. గోల్డెన్ వీసా దక్కడంపై కాజల్ అగర్వాల్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. కళారంగానికి చెందిన సెలబ్రిటీలకు యూఏఈ ప్రభుత్వం తనవంతు ప్రోత్సాహాన్ని అందిస్తోందని, గోల్డెన్ వీసా దక్కడం సంతోషంగా ఉందని తెలిపింది. యూఏఈ ప్రభుత్వంతో భాగస్వామ్యంతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని పేర్కొంది. నాకు ఈ గుర్తింపు ఇచ్చిన యూఏఈ మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు. భవిష్యత్‌లో కూడా మీ సహాయ సహకారాలు కొనసాగాలని కోరుకుంటున్నాను అని కాజల్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కాజల్ సోషల్ మీడియాలో ప్రకటించి ఓ ఫోటోను షేర్ చేసింది.