గత 24 ఏండ్లుగా రష్యా అధ్యక్షుడిగా, ప్రధానిగా అధికారంలో కొనసాగుతున్న పుతిన్ మరోసారి దేశ అధ్యక్షుడిగా విజయం సాధించారు. అసమ్మతి గళాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన పుతిన్, బలమైన ప్రత్యర్థులు లేకుండా జరిగిన ఈ ఎన్నికల్లో 87 శాతం ఓట్ల సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో మరో ఆరేండ్లు రష్యా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. ఈపదవీ కాలం పూర్తయితే రష్యాను అత్యధిక కాలం పాలించిన నేతగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. 1999 డిసెంబర్ నుంచి పుతిన్ రష్యా అధ్యక్షుడిగా లేదా ప్రధానిగా కొనసాగుతున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)