అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డెమోక్రాటిక్ అభ్యర్థిత్వంపై వ్యతిరేక ప్రచారం జరుగుతుండగా, తాజాగా ఆయన మరో ప్రకటన సంచలనానికి దారితీసింది. తనకు నిద్ర సరిపోవట్లేదని, రాత్రి 8 గంటల తర్వాత ప్రచారంలో పాల్గొనలేనని, అర్ధరాత్రి షెడ్యూల్ వద్దని తన పార్టీ వారిని ఆదేశించినట్టు తెలిసింది. వైట్‌హౌస్ లో ప్రత్యక్షంగా పాల్గొన్న గవర్నర్లు, వర్చువల్‌గా హాజరైన పార్టీ నేతలను ఉద్దేశించి సంయుక్తంగా ప్రసంగిస్తూ తనకు తేలికైన పనిభారం, విశ్రాంతి అవసరమని ఆయన నొక్కిచెప్పారు.
గత నెలలో ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లో ఆయన తడబాటుకు గురవ్వడంతో డెమోక్రాట్లలో ఆందోళన వ్యక్తమైంది. విస్తృతంగా చేపట్టిన అంతర్జాతీయ పర్యటనల కారణంగా ఏర్పడిన అలసటతో తాను ఆ రోజు డిబేట్‌లో వెనుకబడ్డానని ఇప్పటికే బైడెన్ స్పష్టం చేశారు.