అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే ఒక శృంగార తారతో అనైతిక ఒప్పందం చేసుకున్న కేసులో అరస్టై బయటకు వచ్చిన ఆయనకు లైంగిక ఆరోపణల కేసులో మరో షాక్ తగిలింది. మాజీ కాలమిస్ట్ జీన్ కారోల్ (79)ను లైంగికంగా వేధించారన్న ఆరోపణపై ట్రంప్‌నకు రూ.41 కోట్ల జరిమానా విధిస్తూ ఫెడరల్ కోర్టు తీర్పు చెప్పింది. కారోల్ లైంగికదాడికి గురైనట్టు చేసిన ఆరోపణలను తిరస్కరిస్తున్నాం. ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్నది నిజం. ఆమె పరువు తీయడానికి ట్రంప్ ప్రయత్నించారు అని జ్యూరీ తీర్పు చెప్పింది.