Skip to main content

Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ వలసదారులను ఇతర దేశాలకు తరలించడాన్ని అక్కడి ఫెడరల్‌ కోర్టు తప్పుబట్టింది. ట్రంప్‌ కార్యవర్గం నిర్ణయాన్ని తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తూ మసాచుసెట్స్‌లోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి బ్రియాన్‌ మర్ఫీ ఈ మేరకు తీర్పు వెలువరించారు. అధికారం చేపట్టినది మొదలు అక్రమ వలసదారులపై ట్రంప్‌ కొరడా ఝళిపిస్తున్నారు. ఈ క్రమంలో వలసదారులను యూఎస్‌ నుంచి గ్వాటెమాలా, దక్షిణ సూడాన్‌, కోస్టారికా వంటి ఇతర దేశాలకు తరలించారు. ఆ వలసదారులు దీనిపై కోర్టులో దావా వేయగా, తాజాగా న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు ట్రంప్‌ యంత్రాంగానికి 15 రోజుల సమయముంది.

Social Share Spread Message

Latest News