Namaste NRI

దీపికా పడుకోన్‌కు మరో షాక్‌ …కల్కి-2 నుంచి ఔట్‌

తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్‌ అగ్ర నాయిక దీపికా పడుకోన్‌ కు మరో షాక్‌ తగిలింది. ప్రభాస్‌ కల్కి-2 చిత్రంలో దీపికా పడుకోన్‌ నటించడం లేదని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ వెల్లడించింది. దీపికా పడుకోన్‌ కల్కి-2 లో భాగం కాబోవడం లేదు. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. తొలిభాగం కోసం దీపికతో కలిసి సుదీర్ఘ ప్రయాణం చేశాం. అయినా మా భాగస్వామ్యాన్ని కొనసాగించలేకపోతున్నాం. కల్కి వంటి చిత్రాలకు అంకితభావంతో పాటు చాలా విషయాలు అవసరమవుతాయి. ఆమె భవిష్యత్తు ప్రాజెక్ట్స్‌ అన్నీ విజయవంతం కావాలని కోరుకుంటున్నాం అంటూ వైజయంతీ మూవీస్‌ పేర్కొంది.  దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా పేరు తెచ్చుకున్న కల్కి-2 నుంచి దీపికా పడుకోన్‌ తప్పుకోవడంతో ఆమె స్థానంలో ఎవరు నటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Social Share Spread Message

Latest News