
అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలసదారులకు మరో షాక్ ఇచ్చింది. గతంలో జో బైడెన్ హయాంలో సీబీపీ వన్ యాప్ ద్వారా అగ్రరాజ్యంలోకి ప్రవేశించిన వారంతా వెంటనే అమెరికాను వీడి వెళ్లిపోవాలని ఆదేశించింది. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ సెక్యూరిటీ విభాగం అభివృద్ధి చేసిన సీబీపీ వన్ యాప్ ద్వారా 2023 జనవరి నుంచి 9 లక్షల మందికిపైగా వలసదారులు అమెరికాలో ప్రవేశించారు. అమెరికాను వీడివెళ్లని వలసదారులకు రోజుకు దాదాపు రూ.86 వేల మేరకు జరిమానా విధించాలని, ఆ జరిమానా చెల్లించనివారి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ సర్కారు భావిస్తున్నది.
