Namaste NRI

అమెరికాలో మ‌ళ్లీ కాల్పుల ఘ‌ట‌న

అమెరికాలో మ‌ళ్లీ కాల్పుల ఘ‌ట‌న జ‌రిగింది. ఇండియానాపోలీస్ న‌గ‌రంలోని వాఫెల్ హౌజ్ రెస్టారెంట్‌లో ఫైరింగ్ జ‌రిగింది. ఆగంత‌కుడు జ‌రిపిన ఆ కాల్పుల్లో ఒక‌రు మృతిచెంద‌గా, మ‌రో అయిదుగురు గాయ‌ప‌డ్డారు. ఆరుగురికి తూటా గాయాలు ఉన్న‌ట్లు గుర్తించారు. ఏరియా ఆస్ప‌త్రిలో ఓ మ‌హిళ మృతిచెందిన‌ట్లు అధికారు లు చెప్పారు. మ‌రో మ‌హిళ ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. రెండు గ్రూపుల మ‌ధ్య గొడ‌వ జ‌ర‌గ‌డం వ‌ల్ల కాల్పులు ఘ‌ట‌న చోటుచేసుకున్న సాక్ష్యులు చెబుతున్నారు. రెస్టారెంట్ లోప‌ల‌, బ‌య‌ట ఆ ఫైరింగ్ జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసులు ఎవ‌ర్నీ అరెస్టు చేయ‌లేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events