అమెరికాలో మరోమారు కాల్పుల మోత మోగింది. షికాగో సమీపంలోని జోలియట్ జరిగిన షికాగో హలోవీన్ పార్టీలో జనాలపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 12 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కాల్పుల సమయంలో పార్టీలో దాదాపు 200 ఉన్నారు. ఎత్తైన చోటు నుంచి ఇద్దరు వ్యక్తుల సమూహంపై కాల్పులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. చనిపోయిన వారి ఆత్మలు తిరిగి భూమిపైకి వస్తాయన్న నమ్మకంతో ఏటా అక్టోబరు 31న అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాల్లో ఈ హలోవీన పార్టీలు దెయ్యాల వేషధారణల్లో చేస్తూంటారు.