Skip to main content

Namaste NRI

రామాయణం నుంచి మరో పాట రిలీజ్- కట్టిపడేసే విజువల్స్​తో రంగులు రంగులే సాంగ్

నితీశ్‌ తివారీ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా పౌరాణిక దృశ్యకావ్యం రామాయణం. ఇందులో సీతారాములుగా సాయిపల్లవి, రణబీర్‌కపూర్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా మూడువేల కోట్ల నిర్మాణ వ్యయంతో రెండు భాగాలుగా నమిత్‌ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్‌ 5న విడుదల కానున్నది. ఈ సినిమా సంగీత ప్రయాణంలో భాగంగా రంగులు రంగులే అంటూ సాగే ఈ సినిమాలోని గీతాన్ని మేకర్స్‌ విడుదల చేశారు. సీతారాముల ప్రేమకథను అద్భుతమైన విజువల్స్‌తో ఈ పాటలో చూపించారు. అందమైన ప్రకృతి, వైభవోపేతమైన రాజప్రాసాదాలు, సీతారాముల వివాహ వేడుకలు ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈపాటను విడుదల చేశారు. నువ్వే నా జీవం.. లోకాన.. అనురాగం అవనిజగా మారిన రూపం కనుదీపం.. వైభోగమే వర్షించావు నా కోసం.. హృదయం నీ ధామం..ఈ జన్మ నీకంకితం.. నీతోడే ఉంటే రంగులు రంగులే.. మంగళ భరితమే.. ప్రేమనే రంగుల సౌధం అంటూ సాగే ఈ పాట తెలుగు వెర్షన్‌ను రాకేందు మౌళి రాయగా, ఏఆర్‌ రెహమాన్‌ స్వరపరిచారు. రాఘవ్‌ కౌశిక్‌, వైశాలి సామంత్‌ ఆలపించారు.

యుగయుగాలుగా జన హృదయాల్లో జీవిస్తున్న రామాయణ గాధను సంగీతం ద్వారా ఆవిష్కరించే అవకాశం రావడం నా అదృష్టం. సీతారాముల ప్రేమభావాలను సంగీతంలో ప్రతిబింబించేందుకు ప్రయత్నించాను. ఈ రంగులు రంగులే పాట ప్రేక్షకుల్లో భక్తిభావంతో పాటు అనిర్వచనీయమైన ఆనందాన్ని, ప్రేమానుభూతిని అందిస్తుందని నా నమ్మకం అని మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌ అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events