Namaste NRI

గగన్‌యాన్‌లో ఇస్రో మరో ముందడుగు!

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ  మరో ప్రయోగానికి మిషన్‌కు సన్నద్ధమవుతున్నది. ప్రస్తుతం గగన్‌యా న్‌ మిషన్‌ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ మిషన్‌లో తొలిసారిగా అంతరిక్షయాత్ర చేపట్ట నుండగా, ఈ కీలకమైన ప్రాజెక్టులో ఇస్రో మరో ముందడుగు వేసింది. మిషన్‌ కోసం ఎల్‌వీఎం-3 లాంచ్‌ వెహికిల్‌ క్రయోజ నిక్‌ ఇంజిన్‌ను ఇస్రో వాడనున్నది. సీఈ20 క్రయోజనిక్‌ ఇంజిన్‌ గగన్‌యాన్‌ మిషన్‌కు సిద్ధంగా ఉందని ఇస్రో తెలిపింది.

అనేక కఠినమైన పరీక్షల తర్వాత సీ20 క్రయోజనిక్‌ ఇంజిన్‌ భద్రతా ప్రమాణపత్రాన్ని పొందిందని తెలిపింది. తొలి మానవసహిత ఫ్లయిట్‌ ఎల్‌వీఎం-3 జీ1 కోసం సిద్ధం చేసిన సీఈ20 క్రయోజనిక్‌ ఇంజిన్‌ అన్ని పరీక్షల తర్వాత సర్టిఫెకెట్‌ పొందిందని, ఈ ప్రక్రియ ఈ నెల 13న చివరి దశ క్వాలిఫికేషన్‌ పరీక్షలు పూర్తయ్యిందని బుధవారం ఇస్రో ప్రకటించింది. మనుషులను సురక్షితంగా తీసుకెళ్లడానికి ఎల్‌విఎం3 రాకెట్‌కు శక్తినిచ్చే సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ మానవ రేటింగ్‌లో ప్రధాన మైలురాయిని సాధించిందని భారత అంతరిక్ష సంస్థ ఇస్రో తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events