రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్. తాజాగా అభిమానులకు మేకర్స్ చిన్న సర్‌ప్రైజ్ ఇచ్చారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ షూటింగ్ విరామంలో ప్రశాంతంగా పచ్చని గడ్డిపై మ్యాట్ వేసుకుని సేదతీరుతూ ఉన్నారు. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా? ఈ చిత్రంలో నాటు నాటు సాంగ్ ఏ రేంజ్‌లో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ పాట షూటింగ్ బ్రేక్ టైంలో రిలాక్స్ అవుతుండగా అక్కడే ఉన్న కెమెరాలు తారక్, చరణ్‌ను క్లిక్ మనిపించాయి. ఇద్దరూ గ్రీనరిలో పడుకొని సెల్‌ఫోన్ చూస్తూ బ్రేక్ టైంను ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ టీం ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టిందని చెప్పేందుకే ఇదే ఉదాహరణ. వీరిద్దరూ ఫోన్లు చూసుకుంటూ ఇచ్చిన ఫొటోను చిత్రం బృందం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. అగ్రదర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ కనిపించనుండగా, ఎన్టీఆర్ కొమ్రం భీం రోల్‌లో నటిస్తున్నాడు. బాలీవుడ్ నటి అలియాభట్ సీత పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్లు శ్రియా శరణ్Ñ అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 25న విడుదల కానుంది.