Skip to main content

Namaste NRI

అమెరికాలో మరో దారుణ ఘటన… భార‌తీయ అమెరిక‌న్ వివేక్ పై 

అమెరికాలో భారత సంతతి వ్యక్తుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.  భార‌తీయ అమెరిక‌న్ వివేక్ త‌నేజ (41) మృతి చెందిన‌ట్లు అధికారులు చెప్పారు. ఫిబ్ర‌వ‌రి రెండో తేదీన అత‌నిపై వాషింగ్ట‌న్‌లో దాడి జ‌రిగింది. ఓ వ్య‌క్తి అత‌న్ని తీవ్రంగా కొట్టాడు. అత‌ని త‌ల పేవ్మెంట్‌ను ఢీకొన‌డంతో ర‌క్త‌స్త్రావం జ‌రిగింది. ఆ రోజున ఓ రెస్టారెంట్‌లో ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. రాత్రి రెండు గంట‌ల‌కు రెస్టారెంట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఇద్ద‌రూ నెట్టేసుకున్నారు. అయితే గొడ‌వ పెద్ద‌గ కావ‌డంతో అత‌నిపై అటాక్ జ‌రిగింది. వివేక్ త‌నేజ ఆ అటాక్‌లో స్పృహ కోల్పోయాడు. చికిత్స పొందుతూ  అత‌ను చ‌నిపోయిన‌ట్లు పోలీసులు తెలిపారు. దాడి చేసిన నిందితుడి కోసం గాలింపు జ‌రుగుతు న్న‌ట్లు చెప్పారు. ఆ వ్య‌క్తిని ఇంకా గుర్తించ‌లేద‌న్నారు. అటాక‌ర్ ఆచూకీ చెప్పిన వారికి 25 వేల డాల‌ర్లు రివార్డు ఇవ్వ‌నున్న‌ట్లు పోలీసులు ప్ర‌క‌టించారు.

Social Share Spread Message

Latest News