Namaste NRI

ప్రపంచ క్రీడా చరిత్రలో… మరో దారుణ సంఘటన

ప్రపంచ క్రీడా చరిత్రలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. సాకర్‌ స్టేడియంలో తొక్కిసలాట జరిగి ఇద్దరు పోలీసులు సహా 125 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఓడిపోయిన జట్టు మద్దతుదారులు క్రీడా స్ఫూర్తిని మర్చిపోయి ఆగ్రహావేశాలతో ఘర్షణకు దిగడం రణరంగానికి దారితీసింది. ఇండొనేషియాలో తూర్పు జావా ప్రావిన్స్‌లోని మలాంగ్‌ సిటీ కంజురుహాన్‌ స్టేడియంలో ఈ దారుణం జరిగింది. ఇప్పటిదాకా 125 మంది మృత్యువాత పడ్డారు. తొక్కిసలాటలో మరో 100 మందికిపైగా  గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 11 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడిరచింది.

తూర్పు జావా ప్రావిన్స్‌లో మలాంగ్‌ పట్టణంలోని ఓ స్టేడియంలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో పెర్సెబాయ సురబాయ జట్టు చేతిలో ఆతిథ్య అరెమా ఎఫ్‌సీ జట్టు 3`2 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో అరెమా జట్టు ఓటమిని జీర్ణించుకోలేని ఆ జట్టు అభిమానులు స్టేడియంలోకి దూసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాష్సవాయువు ప్రయోగించడంతో పాటు లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో ఎగ్జిట్‌ గేటు నుంచి బయటకు వెళ్లే సమయంలో తొక్కిసలాట చోటుచేసుకున్నది. కొంతమంది గుంపులో ఊపిరాడక మరణించగా, తొక్కిసలాటలో కాళ్ల కింద పడి మరికొంత మంది మరణించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events