అగ్రరాజ్యం అమెరికా వెళ్లేవారికి గుడ్‌న్యూస్. 2020 మార్చి నుంచి నిలిపివేసిన పర్యాటక వీసా బీ1, బీ2 లకు సంబంధించిన ఇంటర్వ్యూలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు యూఎస్ కాన్సులేట్ ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి వీసా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ తెలిపింది. పర్యాటక వీసా బీ1, బీ2 కోసం తొలిసారి దరఖాస్తు చేసుకునేవారికి సెప్టెంబర్ నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన అపాయింట్‌మెంట్ల కోసం త్వరలోనే బుకింగ్స్ ప్రారంభిస్తామని తెలిపింది. రోలింగ్ బేసిస్ ఆధారంగా సాధ్యమైనంత ఎక్కువ అపాయింట్‌మెంట్స్ అందుబాటులో ఉంచనున్నట్లు తెలియజేసింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)