Skip to main content

Namaste NRI

సంక్రాంతికి వస్తున్నాం అంటోన్న వెంకటేశ్‌

వెంకటేష్‌ కథానాయకుడు నటిస్తున్న తాజా చిత్రానికి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్యరాజేష్‌ కథానాయికలు. అనిల్‌ రావిపూడి దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. శుక్రవారం టైటిల్‌ను ప్రకటించడంతో పాటు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. హీరో, ఆయన భార్య, మాజీ ప్రేయసి మధ్య నడిచే ట్రయాంగిల్‌ క్రైమ్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని, ఆద్యంతం హాస్యప్రధానంగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, రచన-దర్శకత్వం: అనిల్‌ రావిపూడి. ఎఫ్‌-2, ఎఫ్‌-3 చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది కావడం విశేషం. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి.

Social Share Spread Message

Latest News