ఆస్కార్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మనదేశం నుంచి అనూజ చిత్రం షార్ట్‌లిస్ట్ అయిన విషయం తెలిసిందే. గునీత్ మోంగా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆడమ్ జే గ్రేవ్స్ దర్శకత్వం వహించారు. గురువారం ప్రకటించిన 2025 ఆస్కార్ పురస్కారాల నామినేషన్ జాబితాలో ఈ సినిమా చోటు దక్కించుకుంది. ఈ చిత్రానికి అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. 97వ ఆస్కార్ అవార్డుల కోసం నామినేషన్ దక్కించుకున్న సినిమాల వివరాలను గురువారం వెల్లడించారు. మార్చి 2న లాస్‌ఏంజిల్స్‌లోని ప్రఖ్యాత డాల్బీ థియేటర్‌లో ఈ అవార్డుల ప్రదానం జరగనుంది.